: మెదక్ జిల్లాలో కుంభవృష్టి... హైదరాబాద్, మెదక్ మధ్య రాకపోకలు బంద్!

గత రాత్రి నుంచి మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పసుపులేరు వాగు ఉప్పొంగింది. వాగు నీటి ప్రవాహం రోడ్డుపై మూడు అడుగుల ఎత్తు మేరకు పారుతోంది. నీటి ప్రవాహానికి ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ట్రాఫిక్ జాంలో నిలిచిపోగా, వరద ఉద్ధృతి తగ్గిన తరువాతనే వాహనాల ప్రయాణానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఈ ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

More Telugu News