: ఏపీ, తెలంగాణల్లో మరో మూడు రోజులు పలు రైళ్లు రద్దు

భారీ వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టిన కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 16 రైళ్లను ఆదివారం నుంచి మంగళవారం వరకూ మూడు రోజుల పాటు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సత్తెనపల్లి - పిడుగురాళ్ల మధ్య రైళ్లు నడిచే పరిస్థితి లేదని తెలిపింది. దీంతో మరో మూడు రోజుల పాటు విజయవాడ - సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేస్తున్నామని 27 వరకూ రెండు వైపులా ఇంటర్ సిటీ నడవబోదని తెలిపింది. గుంటూరు, వికారాబాద్ మధ్య తిరిగే పల్నాడు ఎక్స్ ప్రెస్ ను 27 వరకూ, నేడు విజయవాడ - సికింద్రాబాద్ మధ్య నడవాల్సిన స్పెషల్ రైలు, మిర్యాలగూడ - పిడుగురాళ్ల ప్యాసింజర్, మాచర్ల - భీమవరం ప్యాసింజర్, గుంటూరు - మాచర్ల ప్యాసింజర్, మాచర్ల - నడికుడి ప్యాసింజర్ లను మూడు రోజుల పాటు, 27న నడవాల్సిన కాచిగూడ - గుంటూరు డబుల్ డెక్కర్ (రెండు వైపులా) సర్వీసులను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

More Telugu News