: 22 హార్పాన్ మిసైల్ సిస్టమ్స్ ను భారత్ కు ఇవ్వనున్న బోయింగ్

భారత నావికాదళం వినియోగిస్తున్న 'శిశుమార్' క్లాస్ సబ్ మెరైన్లలో వినియోగించేందుకు 22 హార్పాన్ మిసైల్ సిస్టమ్స్ ను అందించేందుకు బోయింగ్ తో డీల్ కుదిరింది. ఈ డీల్ కు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా పలికింది. మొత్తం 81 మిలియన్ డాలర్ల విలువైన డీల్ లో భాగంగా 89 మిసైళ్లు ఇండియాకు రానున్నాయి. వాటిని ప్రయోగించేందుకు అవసరమయ్యే 22 సిస్టమ్స్ కూడా రానున్నాయి. జూన్ 2018లోగా అన్ని క్షిపణులూ ఇండియాకు చేరుతాయని అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణుల కోసం జూలై 2014 నుంచి ఇండియా, అమెరికాల మధ్య చర్చలు సాగాయి. ఇప్పటికే భారత వాయుసేన నిర్వహణలోని జాగ్వార్ యుద్ధ విమానాల ద్వారా హార్పాన్ క్షిపణులను ప్రయోగించే వ్యవస్థలను కొనుగోలు చేసిన భారత్, ఇప్పుడు జలాంతర్గాముల నుంచి కూడా వీటిని ప్రయోగించే వీలును పొందనుంది.

More Telugu News