: హైదరాబాదు అంటే బిర్యానీతో మొదలు పెట్టాలి: ధోనీ

హైదరాబాదు అంటే బిర్యానీ గుర్తుకొస్తుందని టీమిండియా కెప్టెన్ ధోనీ తెలిపాడు. 'ఎంఎస్ ధోనీ ఎన్ అన్ టోల్డ్ స్టోరీ' సినిమా ఆడియో విడుదల సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 2000వ సంవత్సరం నుంచి తనకు హైదరాబాదీ బిర్యానీతో అనుబంధం ఏర్పడిందని అన్నాడు. హైదరాబాదులో టీమిండియాకు మంచి రికార్డు ఉందని ధోనీ తెలిపాడు. టీమిండియా ఎప్పుడు హైదరాబాదులో ఆడినా మంచి ఫలితాలు సాధించిందని చెప్పాడు. అందర్లాగే తాను చాలా కష్టపడి క్రికెటర్ ని అయ్యానని అన్నాడు. గుడ్డిగా కష్టపడడం కాకుండా ఏం సాధించాలన్న క్లారిటీతో లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపాడు. పెద్దలకు గౌవరం ఇవ్వాలని, అలా పెద్దలకు గౌవరం ఇస్తూ పోతుంటే వారి నుంచి చాలా నేర్చుకునే అంశాలు ఉంటాయని అన్నాడు. లక్ష్యం చేరుకోవాలంటే హార్డ్ వర్క్ చేయాలని ధోనీ సూచించాడు. తెలుగులో తాను చూసిన సినిమాలు 'అపరిచితుడు', 'బాహుబలి' అని చెప్పాడు. దక్షిణాదిలో మంచి నటులు, దర్శకులు ఉన్నారని, అంతకంటే గొప్ప సినీ అభిమానులు ఉన్నారని ధోనీ తెలిపాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మంచి నటుడని అన్నాడు. 9 నెలలు ఈ సినిమా కోసం కష్టపడ్డాడని ధోనీ తెలిపాడు. క్రికెట్ షాట్లు నేర్చుకునేందుకు చాలా కష్టపడ్డాడని ధోనీ చెప్పాడు. ఒక వ్యక్తి ఆటోబయోగ్రఫీలోకి ఇంకో వ్యక్తి ప్రవేశించి, నటించడం చాలా కష్టమని, సుశాంత్ చాలా కష్టపడ్డాడని ధోనీ తెలిపాడు. సినిమా అందర్నీ అలరిస్తుందని ధోనీ అన్నాడు.

More Telugu News