: తమిళనాట వైఫై ఉచితం... బస్టాండ్లు, మాల్స్ లో 'అమ్మ వైఫై'

ఇప్పటికే మంచి నీటి నుంచి సిమెంట్ వరకూ, ఔషధాల నుంచి భోజనం వరకూ కొన్ని అతి తక్కువ ధరకూ, మరికొన్ని ఉచితంగా అందిస్తూ, 'అమ్మ' పేరిట ఎన్నో పథకాలను ప్రారంభించిన తమిళనాడు సర్కారు, తాజాగా యువతకు దగ్గరయ్యేందుకు మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పెద్ద బస్టాండ్లు, మాల్స్ లో 'అమ్మ ఉచిత వైఫై' సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించింది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తొలి దశలో 50 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హయ్యర్ సెకండరీ, కాలేజ్ విద్యాభ్యాసం చేస్తున్న వారికి కూడా ఉచిత ఇంటర్నెట్ ను అందించనున్నామని తెలిపింది. తొలిదశలో 50 పాఠశాలల్లో రూ. 10 కోట్ల వ్యయంతో వైఫై టవర్లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. షోలింగనల్లూర్ ప్రాంతంలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణముండే ఇంటిగ్రేటెడ్ ఐటీ కాంప్లెక్స్ ను రూ. 80 కోట్లతో నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేసింది. 650 శాశ్వత ఈ-రిజిస్ట్రేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది.

More Telugu News