: నిండిన హుస్సేన్ సాగర్...వారాంతపు సరదాలకు దూరంగా ఉండండి: జీహెచ్‌ఎంసీ

హైదరాబాదు వాసులకు ఆటవిడుపుగా ఆహ్లాదాన్ని పంచే హుస్సేన్ సాగర్ ఇప్పుడు నిండుకుండలా మారింది. క్షణక్షణానికి వచ్చి చేరుతున్న నీటితో అధికారులు అప్రమత్తమయ్యారు. హుస్సేన్ సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల ప్రజలను తరలించేందుకు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు అదనపు కమిషనర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అశోక్‌నగర్‌, గాంధీనగర్‌ తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లుంబినీ పార్కు, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్స్ మూసేశారు. వీకెండ్స్ సరదాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వర్షాలు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో అంతా క్షేమంగా ఉండాలంటే ఇళ్లే సురక్షితమని అధికారులు నగరవాసులకు హెచ్చరికలు జారీ చేశారు. అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

More Telugu News