: ‘ఆర్బిట్’ ఎండీ పూజిత్ అగర్వాల్ అరెస్టు

కాప్రీ గ్లోబల్ అడ్వైజరీ సర్వీసు (సీజీఏఎస్) ను మోసం చేసిన కేసులో ఆర్బిట్ కార్పోరేషన్ ఎండీ పూజిత్ అగర్వాల్ ను అరెస్టు చేశారు. సీజీఏఎస్ ను రూ.51.01 కోట్లకు మోసం చేసిన కేసులో ఆయన్ని నిన్న అరెస్టు చేసినట్లు ముంబయి ఆర్థిక నేర విభాగం (ఈవోడబ్ల్యూ) పేర్కొంది. ‘ఆర్బిట్’ సంస్తపైన, పూజిత్ అగర్వాల్ , ఆయన తండ్రిపైన కేసు నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ తెలిపింది. అయితే, రూ.2.53 కోట్ల కేసులో ఇప్పటికే ఆయన్ని ఆజాద్ మైదాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది. దీంతో, ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న అగర్వాల్ ను ఈవోడబ్ల్యూ అధికారులు మరోసారి అరెస్టు చేశారు. పూజిత్ ను త్వరలో కోర్టులో హాజరుపరచనున్నట్లు ఈవోడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు. కాగా, సకినకలోని ఆర్బిట్ రెసిడెన్సీ పార్క్ లో మూడు ఫ్లాట్లలో తాము పెట్టుబడులు పెట్టినట్లు సీజీఏఎస్ పేర్కొంది. అయితే, ఆ నిర్మాణాలు ఇంతవరకూ పూర్తికాలేదని సదరు సంస్థ తెలిపింది.

More Telugu News