: ‘పులిచింతల’, ‘ప్రకాశం బ్యారేజ్’ గేట్లు ఎత్తివేత

పులిచింతల ప్రాజెక్ట్ కు చెందిన 10 గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 4.6 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2.5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కాగా, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు చెందిన 10 గేట్లను ఎత్తివేశారు. ఒక అడుగు మేరకు గేట్లను ఎత్తివేసినట్లు జలవనరుల శాఖాధికారులు పేర్కొన్నారు. దీంతో, 7,250 క్యూసెక్కుల నీరు సముద్రంలో కలవనుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 11.9 అడుగులుగా ఉంది. బ్యారేజీ కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు.

More Telugu News