: హైదరాబాద్ - గుంటూరు రాకపోకలు బంద్!

గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దాచేపల్లి నుంచి పిడుగురాళ్ల, సత్తెనపల్లి మీదుగా గుంటూరుకు వెళ్లే రహదారిలో 15 ప్రాంతాల్లో వాగులు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. రోడ్లపై రెండు నాలుగు అడుగుల మేరకు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో, హైదరాబాద్ నుంచి నల్గొండ మీదుగా గుంటూరుకు రాకపోకలు నిలిచాయి. రోడ్లపై ఎత్తయిన ప్రాంతాల్లో వందలాది వాహనాలు వరద ఎప్పుడు తగ్గుతుందా? అని వేచి చూస్తున్నాయి. ముఖ్యంగా పిడుగురాళ్ల - దాచేపల్లి మధ్య పరిస్థితి ఆందోళనగా ఉంది. ఈ మధ్యాహ్నం కొన్ని ముఖ్యమైన సర్వీసులను సూర్యాపేట, విజయవాడ మీదుగా గుంటూరుకు పంపినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు నరసరావు పేట నుంచి గుంటూరుకు వెళ్లే మార్గంలోని జొన్నలగడ్డ వాగు జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తుండటంతో, ఆ మార్గంలోనూ రాకపోకలు నిలిచాయి.

More Telugu News