: ఫస్ట్ డే లంచ్ బ్రేక్...టీమిండియా 105/1

500వ టెస్టు తొలిరోజు లంచ్ విరామ సమయానికి ఒక వికెట్ కోల్పోయిన భారత జట్టు 105 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మన్ కు కివీస్ బౌలర్లు స్వేచ్ఛగా బ్యాటు ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు. కట్టుదిట్టమైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టారు. అయితే టీమిండియా బ్యాట్స్ మన్ కూడా తామేం తక్కువ తినలేదన్నట్టు ఇన్ అండ్ అవుట్ స్వింగర్లు, గుడ్ లెంగ్త్, షార్ట్ పిచ్, బౌన్సర్, యార్కర్, గుగ్లీ, లెగ్ కట్టర్, ఆఫ్ స్పిన్, ఫ్లిప్పర్ ఇలా ఎలాంటి బంతిని సంధించినా అడ్డుకున్నారు. పిచ్ పై పచ్చిక పూర్తిగా తొలగించడంతో తొలుత స్వింగర్లు, యార్కర్లతో పేసర్లు విరుచుకుపడి ఆకట్టుకున్నారు. పిచ్ కు బ్యాట్స్ మన్ అలవాటు పడేంతలో విలియమ్సన్ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. దీంతో అతని నిర్ణయం ఫలితమిచ్చింది. దీంతో ఆదిలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (32) వికెట్ ను శాంటనర్ దక్కించుకున్నాడు. అనంతరం ఛటేశ్వర్ పుజారా (34), మురళీ విజయ్ (39) మరోవికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో తొలిరోజు లంచ్ విరామ సమయానికి 31 ఓవర్లు ఆడిన టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 105 పరుగులు చేసింది.

More Telugu News