: అపెక్స్ మీటింగ్ లో చంద్రబాబుపై హరీశ్ రావు ఫైర్!

నిన్న న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావులు అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరైన సమయంలో, తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కొంత కటువుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. స్నేహపూర్వక చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించగా, హరీశ్ రావు మండిపడ్డారని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఓ వైపు ప్రాజెక్టులకు అడ్డుపుల్లలు వేస్తూ, మరోవైపు స్నేహమంటూ మాట్లాడతారా? అని హరీష్ రావు ప్రశ్నించినట్టు తెలిపింది. పులిచింతల ప్రాజెక్టుకు తెలంగాణ పూర్తి సహాయ సహకారాలు అందించిందని, నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు తాము సహకరించామని గుర్తు చేసిన ఆయన, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నీరు అడుగుతున్న ఏపీకి, శ్రీశైలం నుంచి మాత్రం నీరివ్వడానికి మనసు రావడం లేదని వ్యాఖ్యానించినట్టు తెలిపింది. ఈ దశలో వాగ్వాదం పెరుగుతుండటంతో, కేసీఆర్ కల్పించుకుని రెండు రాష్ట్రాలూ పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటే ఎలాంటి సమస్యా ఉండదని చెప్పి వాతావరణాన్ని తేలిక పరిచే ప్రయత్నం చేశారు.

More Telugu News