: హైదరాబాదులో వర్ష బీభత్సానికి నీట మునిగిన 2 వేల కార్లు, 6 వేల బైకులు

హైదరాబాదులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ధాటికి జంట నగరాల వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షాల ధాటికి హైదరాబాదు వ్యాప్తంగా పలు కాలనీలు, అపార్ట్ మెంట్లలోకి నీరు చేరింది. దీంతో సుమారు 2 వేల కార్లు, 6 వేల ద్విచక్రవాహనాలు, వేల సంఖ్యలో ఆటోలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో వరద బీభత్సానికి కొన్ని ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. వాటి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. నిజాంపేట, మూసాపేట వంటి ప్రాంతాల్లో వర్షం ధాటికి నీరు నిలిచిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అపార్ట్ మెంట్లలో నిలిచిన నీటిని మోటార్ల ద్వారా బయటకు తోడుతున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని నాలాల ద్వారా పంపే ప్రయత్నాన్ని మున్సిపల్ సిబ్బంది చేస్తున్నారు.

More Telugu News