: ప్రతిష్ఠాత్మక 500వ టెస్టుకు ఆతిథ్యమిస్తున్న కాన్పుర్ పిచ్ ఎలా ఉండనుందంటే!

84 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో 500వ ప్రతిష్ఠాత్మక టెస్టుకు ఆతిథ్యమివ్వనున్న వేళ పిచ్ కీలక పాత్ర పోషించనుంది. కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానం ఈ అద్భుత ఘట్టానికి ప్రత్యక్ష సాక్షిగా నిలవనుంది. పేరుకి మాత్రమే ఈ మైదానం గ్రీన్ పార్క్ కానీ, పిచ్‌ పై ఎలాంటి పచ్చికా కనిపించదు. ఈ వేదికపై ఆడడం ఎలాంటి క్రికెటర్ కైనా సవాలే. పిచ్ పై పచ్చిక లేకపోవడానికి తోడు పగుళ్లు ఇక్కడ స్పిన్నర్లు రాణించేందుకు అవకాశం కల్పిస్తుంది. భారత్ ను భారత్ లో ఓడించాలంటే ఎలాంటి జట్టయినా స్పిన్ బౌలింగ్ పై తీవ్రమైన సాధన చేయాల్సి ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. దీనికి తోడు టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు మంచి ఫాంలో ఉన్నారు. వీరికి తోడు పేసర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ వంటి సీనియర్లు కూడా బంతితో రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారికి చేయందించేందుకు కోహ్లీ వంటి పార్ట్ టైమర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాకు అనుకూలంగా ఉండే పిచ్ ను గ్రౌండ్స్ మన్ తయారు చేసే ఉంచారు. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక 500వ టెస్టును టీమిండియా తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతోంది. స్పిన్ ప్రధాన ఆయుధంగా టీమిండియా బరిలో దిగుతుండగా, న్యూజిలాండ్ జట్టు కూడా అదే వ్యూహంతో బరిలో దిగనుండడం ఆసక్తి రేపుతోంది. అయితే భారత క్రికెట్ చరిత్రలో 500వ టెస్టు మైలురాయిని తమ స్పిన్ ఆయుధంతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసి విజయం సాధిస్తుందా? లేక న్యూజిలాండ్ స్పిన్ త్రయం భారత్‌ ను భయపెడుతుందా? అన్న ఆసక్తి రేపుతోంది.

More Telugu News