: అల్పపీడనం ఏర్పడిపోయింది... 48 గంటలు జాగ్రత్తన్న అధికారులు

గడచిన మూడు రోజులుగా బంగాళాఖాతంపై నాలుగు కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవచ్చని తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, పాత ఇళ్లలో ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

More Telugu News