: బాయ్ ఫ్రెండ్ కు వార్నింగ్ ఇస్తూ పదేళ్ల బాలిక లేఖ... 7 వేలకు పైగా రీట్వీట్స్!

జోయ్... అమెరికాలో ఐదో తరగతి చదువుతున్న 10 ఏళ్ల అమ్మాయి. తన క్లాస్ మేట్, బాయ్ ఫ్రెండ్ నోవాకు ఓ లేఖ రాసింది. తనతో స్నేహం చేయాలంటే పాటించాల్సిన రూల్స్ చెబుతూ ఈ లేఖ సాగగా, సూటిగా తన మనసులోని భావాన్ని రంగురంగుల పెన్నులతో కాగితంపై పెట్టింది. ఈ లేఖ క్లాస్ టీచర్ కంట పడగా, తన ఫ్రెండ్ కు పంపితే, ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, 10 వేలకు పైగా లైక్స్, 7 వేలకు పైగా రీట్వీట్స్ తెచ్చుకుని సూపర్ వైరల్ అయింది. అమ్మాయిలు, అబ్బాయిలు హద్దుల్లో ఉండాలని చెబుతూ సాగిన ఈ లేఖలో... "నియమ నిబంధనలు జోయ్ నుంచి నోవాకు... 1. నా భుజాలను తాకరాదు. 2. ఎప్పుడూ నా వెనకే తిరగొద్దు. ఫూలిష్ గా ఇక నుంచి అలా చెయ్యొద్దు. 3. ఏదైనా అత్యవసరమైతే తప్ప నాతో మాట్లాడవద్దు. 4. బస్సులో నాతో ఆటలు ఆడొద్దు. 5. నాకు షార్ట్ టెంపర్. అతి చేసే నీలాంటి వాళ్లను చూస్తే ఇంకా పెరుగుతుంది. అతిగా చేస్తే నువ్వో గర్ల్ ఫ్రెండ్ ను కోల్పోతావు. 6. దీన్ని 500 సార్లు చదువు 7. నువ్వు నన్ను ఇష్టపడచ్చు. కానీ నేను నిన్ను ఇష్టపడడం లేదు. నేనింకా చిన్న పిల్లనే (ఓ గర్ల్ ఫ్రెండ్ గా ఉండేందుకు) ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు పాటించకపోతే, నేను మా నాన్నకు, మా అమ్మ ఫ్రెండుకి, నా సవతి తల్లికి చెబుతా. నువ్వేదైనా నాకు అడ్డుపడితే, నీకు కౌన్సెలింగ్ తప్పదు. నాతో ఆటలాడటం మానెయ్... అంటూ రాసుకొచ్చింది జోయ్.

More Telugu News