: వాట్స్ యాప్ కు పోటీగా 'అల్లో'ను రంగంలోకి దించిన గూగుల్

స్మార్ట్ ఫోన్లలో అత్యధికంగా వాడుకలో ఉన్న సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ 'వాట్స్ యాప్'కు పోటీగా గూగుల్ 'అల్లో' (ALLO) పేరిట కొత్త యాప్ ను విడుదల చేసింది. ఈ సంవత్సరం మేలో జరిగిన ఐ/ఓ డెవలపర్ల సదస్సులో 'డుయో', 'అల్లో'లను గూగుల్ తొలిసారిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది గూగుల్ సెర్చింజన్ ను కలుపుకుని మెసేజింగ్ యాప్ గా పనిచేస్తుంది. ఫోన్ నంబరునే ప్రాథమిక యూజర్ ఐడెంటిఫికేషన్ గా తీసుకుంటుంది. ఒకసారి యాప్ డౌన్ లోడ్ చేసుకుని గూగుల్ ఖాతాతో అనుసంధానించుకుని దీన్ని వాడవచ్చు. ఎన్నో రకాల ఎమోజీలు, కస్టమ్ స్టిక్కర్స్ అందుబాటులో ఉంటాయి. ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించేటప్పుడు, చాట్ విండోను క్లోజ్ చేయకుండానే, గూగుల్ సెర్చ్ ని ఈ యాప్ ద్వారా వాడుకోగలగడం ఆకర్షణీయమైన ఫీచర్. అయితే, వాట్స్ యాప్ లో ఉండే డాక్యుమెంట్ షేరింగ్, కాలింగ్ సదుపాయాలు ఇందులో ఉండవు. ఈ ఫీచర్ ను త్వరలోనే 'డుయో' యాప్ లో తీసుకువస్తామని గూగుల్ ప్రతినిధి అమిత్ ఫులే వెల్లడించారు.

More Telugu News