: 'అణ్వస్త్ర కార్యక్రమాలను తగ్గించుకోండి' అన్న అమెరికాతో.. 'నో... ముందు ఇండియాకు చెప్పండి' అంటూ పాక్ పెడసరి సమాధానం!

అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో సమావేశమైన వేళ, అణ్వస్త్రాల కార్యకలాపాలను తగ్గించుకోవాలని చేసిన సూచనకు షరీఫ్ 'నో' చెప్పారు. కెర్రీ స్వయంగా అమెరికా ఉద్దేశాన్ని నవాజ్ కు చెప్పిన సమయంలో, ముందు ఇండియాను అణు కార్యక్రమాలు తగ్గించుకోమని అమెరికా తరఫున సలహా ఇవ్వాలని కోరినట్టు ఐక్యరాజ్యసమితిలో పాక్ శాశ్వత రాయబారి మలీహా లోధి వెల్లడించారు. న్యూయార్క్ లో మీడియాతో మాట్లాడిన ఆయన "పాకిస్థాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను నియంత్రించుకోబోదు" అని స్పష్టంగా చెప్పారు. కెర్రీతో సమావేశమైన సందర్భంగా, పాక్ ను న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లో సైతం చేర్చుకునే దిశగా చర్చలు సాగాయని లోధి తెలిపారు. కాగా, నేడు ఐరాస సర్వసభ్య సమావేశాల్లో షరీఫ్ ప్రసంగించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News