: తెలంగాణ నీటి పారుదల శాఖలో ఎమర్జెన్సీ ప్రకటన... సెలవులన్నీ రద్దు చేసిన మంత్రి హరీశ్ రావు

తెలంగాణ నీటి పారుదల శాఖలో అత్యయిక పరిస్థితిని విధిస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశిస్తూ, రెవెన్యూ శాఖ ఉద్యోగులతో కలిసి హైదరాబాద్ లో నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని తెలిపారు. నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంజనీర్లంతా ఫీల్డ్ లోనే ఉండాలని, భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించిన అనంతరం హరీశ్ రావు తెలిపారు. వర్షం తగ్గింది కాబట్టి సాధ్యమైనంత తొందరగా వరద నీరు రోడ్లపై నుంచి వెళ్లిపోయేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

More Telugu News