: హైదరాబాదులో కురిసిన వర్షపాతం వివరాలివే... నగర శివార్లలో స్కూళ్లకు నేడు సెలవు

హైదరాబాదులో నిన్న సాయంత్రం నుంచి నేటి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి నగరం వివిధ ప్రాంతాల్లో మోకాలులోతు నీరు ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా రాత్రి కురిసిన వర్షపాత వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. అందులో కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్ నగర్ లో 15.3 సెంటీ మీటర్ల అత్యధిక వర్షపాతం కురిసిందని తెలిపింది. తరువాత బొల్లారంలో 8.7 సెంటీ మీటర్లు, కూకట్ పల్లిలో 6.5 సెంటీ మీటర్లు, బాలానగర్ లో 6.2 సెంటీ మీటర్లు, తిరుమలగిరిలో 6 సెంటీ మీటర్లు, అమీర్ పేట్ లో 5.7 సెంటీ మీటర్లు, రామచంద్రాపురంలో 5.1 సెంటీ మీటర్లు, ఖైరతాబాద్ లో 4.8 సెంటీ మీటర్ల వర్ష వర్షపాతం కురిసిందని తెలిపింది. చెరువులు కట్టలు తెగడం, నాలాలు పొంగి పొర్లడంతో మూసాపేట్, నిజాంపేట్, అల్వాల్, షాపూర్ నగర్, సురారంలోని వివిధ స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

More Telugu News