: పోలీసులను, సైన్యాన్ని రంగంలోకి దించండి: వర్ష బీభత్సంపై అధికారులకు ఢిల్లీ నుంచి కేసీఆర్ ఆదేశాలు

అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, భాగ్యనగరంలో వర్ష బీభత్సంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణం పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం రంగంలోకి దిగి ప్రజలకు సాయపడాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను వారికి అందించాలని, నీటిలో చిక్కుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు సైన్యం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల ఇబ్బందులను సాధ్యమైనంత త్వరగా దూరం చేసేందుకు గ్రేటర్ మునిసిపల్ అధికారులంతా కృషి చేయాలని అన్నారు. ఏ సమయంలోనైనా తిరిగి వర్షం మొదలు కావచ్చన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కంట్రోల్ రూంకు వచ్చే ఫోన్ కాల్స్ పై తక్షణం స్పందించేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించేందుకు సిబ్బందిని సిద్ధం చేయాలని సూచించారు.

More Telugu News