: అపెక్స్ కౌన్సిల్ ముందు వాదనలు వినిపించనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య రెండున్నరేళ్లుగా నలుగుతున్న వివాదం నేడు ఒక కొలిక్కి రానుంది. నేటి మధ్యాహ్నం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల నీటి వాటాలు, నిర్మించనున్న ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వాదనలు వినిపిస్తారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ విజయ్‌ ప్రకాశ్‌ లను తీసుకుని నిన్న రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు.

More Telugu News