: పాకిస్థాన్ పై ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసిన బలూచిస్థాన్ హక్కుల నేతలు

పాకిస్థాన్ పై బలూచిస్థాన్ హక్కుల ప్రతినిధి ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేశారు. తమ రాష్ట్రం (బలూచిస్థాన్) లో సుమారు 15 వేల మంది హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసినట్టు పాకిస్థాన్ సైన్యం చెబుతోందని, కానీ న్యాయస్థానానికి ఇంతవరకు ఒక్క కేసు కూడా రాలేదని ఆయన ఐక్యరాజ్యసమితికి తెలిపారు. తమ రాష్ట్రంలో మానవ హక్కులను దారుణంగా హరిస్తూ, భారత్ పైకి ఉగ్రమూకలను ఎగదోస్తోందని బెలూచ్ ప్రతినిధి ఆరోపించారు. భారత ప్రధానిలా ప్రపంచ దేశాలు కూడా తమకు మద్దతు తెలిపేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఉగ్రదేశమైన పాకిస్థాన్ లో బలూచిస్థాన్ కలిసి ఉండలేదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News