: ‘సౌదీ’ విమానానికి ఎటువంటి బెదిరింపు లేదు.. పైలట్ పొరపాటున ‘డిస్ట్రెస్ కాల్ బటన్’ నొక్కాడట!

సౌదీ అరేబియాకు చెందిన విమానం ప్రమాదం బారిన పడిందనుకున్న వార్తలో ఎటువంటి వాస్తవం లేదు. కేవలం పైలట్ పొరపాటు కారణంగానే భద్రతా దళాలు అప్రమత్తమై విమానాన్ని చుట్టుముట్టాయి. బోయింగ్ 777 విమానం సౌదీలోని జెడ్డా నుంచి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు బయలుదేరింది. 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మనీలాలోని నినోయ్ ఆక్వినో విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో పైలట్ పొరపాటున ‘డిస్ట్రెస్ కాల్ బటన్’ నొక్కేశాడు. దాంతో భద్రతా బలగాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాన్ని చుట్టుముట్టారు. వెంటనే ప్రయాణికులను దించేసి తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు ఆ తనిఖీల్లో వారు గుర్తించలేదు. చివరకు తెలిసిందేమిటంటే, పైలట్ పొరపాటున ఆ బటన్ నొక్కాడని. కాగా, విమానం ప్రమాదంలో ఉందని చెప్పడానికి మాత్రమే ఈ బటన్ ను ఉపయోగిస్తారు.

More Telugu News