: 8వ తేదీన నింగికెగసిన ఇన్ శాట్-3డీఆర్ తీసిన భూమి తొలి కలర్ ఫోటో ఇదే

ఈ నెల 8వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) జీఎస్ఎల్వీ ఎంకే-4 వాహక నౌక ద్వారా ప్రయోగించిన ఇన్ శాట్ -3డీఆర్ శాటిలైట్ భూమి చిత్రాలను తీసి పంపించింది. 15వ తేదీన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను తీసి పంపిన శాటిలైట్, ఆ తరువాత రంగుల్లో భూమి ఫోటోలు తీసింది. ఇస్రో వాటిని ట్విట్టర్ ద్వారా విడుదల చేయగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ చిత్రం విడుదల చేసిన ఐదు రోజుల్లో 700 రీట్వీట్లను తెచ్చుకోగా, కలర్ ఇమేజ్ ఒక్క రోజులోనే 500కు పైగా ట్వీట్లను తెచ్చుకుంది. ఇన్ శాట్ -3డీఆర్ తీసిన చిత్రాన్ని మీరూ చూడవచ్చు.

More Telugu News