: యూఎన్‌ సమావేశంలో పాక్‌కు భంగపాటు.. ఒంటరైన ‘ఉగ్ర’ దేశం

యూరీ దాడుల పాపానికి పాకిస్థాన్ పరిహారం చెల్లించాల్సి వస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పాక్‌ను ఏకాకిని చేయడంలో భారత్ విజయం సాధించింది. యుద్ధ నీతికి బదులు దౌత్య నీతితో షరీఫ్ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాక్ ప్రధానికి భంగపాటు ఎదురైంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ యూరీ దాడులను తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని పాక్‌ను కోరారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు షరీఫ్ ప్రయత్నించారు. అమెరికా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కానీ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ యూరీ దాడులను తప్పుబట్టారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటించాయి. మరోపక్క, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ సైనికులతో కలిసి చేయాల్సిన యుద్ధ విన్యాసాలను రష్యా రద్దు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్రమోదీ మరోవైపు పాక్‌పై దౌత్యపరంగా మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశమైన ప్రధాని కీలక చర్చలు జరిపారు. యూరీ దాడి నేపథ్యంలో పాక్‌లో జరిగే సార్క్ సమావేశాలకు మోదీ హాజరయ్యే విషయంపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మోదీ సమావేశమై యూరీ ఘటనకు సంబంధించిన వివరాలను వివరించారు.

More Telugu News