: ఎంసెట్-3లో వచ్చిన 24 వేల ర్యాంకును 13గా మార్ఫింగ్ చేసి అధికారులను తిప్పలు పెట్టిన అమ్మాయి

ఎంసెట్-3 తరువాత మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతున్న వేళ, తనకు వచ్చిన ర్యాంకును మార్ఫింగ్ చేసుకొచ్చిన ఓ అమ్మాయి ఉస్మానియా వర్శిటీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలు కాగా, ఓ అమ్మాయి వచ్చి, తనకు 13వ ర్యాంకు వచ్చిందని కార్డు చూపింది. అనుమానం వచ్చిన అధికారులు ఆమె ర్యాంకును మార్చి చూపిందని తేల్చారు. 24 వేల తరువాతి ర్యాంకు వచ్చినట్టు అధికారులు చెప్పినా, వినని యువతి వాదనకు దిగింది. తనకు వచ్చింది 13వ ర్యాంకేనని పట్టుబట్టింది. దీంతో కౌన్సెలింగ్ అధికారులు జేఎన్టీయూకు ఫిర్యాదు చేసి, ఆమెపై కేసు నమోదుకు సిఫార్సు చేశారు. ఇక తెలంగాణలో అన్ రిజర్వుడ్ గా ఉండే 15 శాతం సీట్ల కోసం ఏపీ విద్యార్థులు పోటీ పడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగగా, తెలంగాణ ఎంసెట్ లో తొలి ర్యాంకు సాధించిన గుడివాడ విద్యార్థిని మానస, మూడో ర్యాంకర్ తేజస్వినిలు సహా 400 మందికి పైగా హాజరయ్యారు.

More Telugu News