: ఆకట్టుకున్న కౌస్థుబ్ పవార్, సూర్యకుమార్ యాదవ్

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై రంజీ జట్టు ఆకట్టుకుంటోంది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టుతో ముంబై జట్టు వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. మూడు రోజుల ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసింది. దీంతో తొలి రోజు 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు ఆదిలోనే ఓపెనర్ బిస్త్ వికెట్ కోల్పోయింది. దీంతో 21 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు, ఆటముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 107 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్ కౌస్థుభ్ పవార్ (100) సెంచరీ చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగగా, సూర్యకుమార్ యాదవ్ (103) సెంచరీతో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ (18) విఫలమయ్యాడు. తారె (53) తో కలిసి లాడ్ (86) క్రీజులో ఉన్నాడు. ఇంకా మూడో రోజు ఆట మిగిలి ఉంది. కివీస్ బౌలర్లలో సోదీ (2), సాంటనర్ (1), బౌల్ట్ (1) ఆకట్టుకున్నారు.

More Telugu News