: అజర్‌నూ పిలిచారు.. చారిత్రక టెస్ట్‌కు మాజీ కెప్టెన్‌ను ఆహ్వానించిన బీసీసీఐ

మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని చిక్కుల్లో పడిన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను ఇటీవల కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా బీసీసీఐ మాత్రం అధికారిక కార్యక్రమాలకు అజర్‌ను దూరంగా ఉంచుతూ వస్తోంది. అయితే తాజాగా న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరగనున్న చారిత్రక 500వ టెస్ట్‌కు రావాల్సిందిగా అజర్‌కు బీసీసీఐ నుంచి ఆహ్వానం అందింది. చారిత్రక టెస్టుకు మాజీ కెప్టెన్లందరినీ ఆహ్వానించిన బోర్డు తొలత ఈ ‘మణికట్టు మాంత్రికుడి’ని ఆహ్వానించకూడదనే నిర్ణయించుకుంది. అయితే తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్న బోర్డు అజర్‌కు ఆహ్వానం పంపింది. టెస్ట్‌ను తిలకించేందుకు వస్తానని అజర్ కూడా చెప్పాడట. అజర్‌ను ఆహ్వానించిన విషయాన్ని బోర్డు సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ నెల 22న ప్రారంభం కానున్న టెస్ట్‌మ్యాచ్ భారత్‌కు 500వ మ్యాచ్. ఈ సందర్భంగా టీమిండియా మాజీ సారథులను ఆహ్వానించిన బీసీసీఐ వారిని ఘనంగా సన్మానించనుంది.

More Telugu News