: ఆ విమానంలోని వారంతా చనిపోయారు... రావాల్సిన బీమా తదితరాలు చూసుకోండి: కుటుంబాలకు సమాచారం ఇచ్చిన వాయుసేన

జూలై 22న చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన భారత వాయుసేన విమానం ఏఎన్ 32లో ప్రయాణిస్తున్న 29 మందీ చనిపోయారని అధికారులు బాధితుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే విమానం వెతుకులాట నిలిపివేసిన అధికారులు, ఈ మేరకు విమానంలో ప్రయాణించిన వారి బంధువులకు విషయం చెప్పి, బీమా తదితర ఫార్మాలిటీస్ కు సంబంధించి ఏం చేయాలన్న సమాచారాన్ని చెప్పారు. దాదాపు నెలన్నర పాటు 17 షిప్ లు, ఓ సబ్ మెరైన్, 23 విమానాలు మాయమైన వాయుసేన విమానం కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, విమానం జాడ కనుక్కోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. జూలైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై రక్షణ మంత్రి ఓ ప్రకటన చేస్తూ, విమానంలోని వారంతా మరణించి వుండవచ్చని వ్యాఖ్యానించగా, ఆ విషయాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.

More Telugu News