: కడప జిల్లాలో దారుణం... పెద్ద భార్య కొడుకును హత్యచేసిన రెండో భార్య!

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో పెద్ద భార్య కుమారుడిని రెండో భార్య హత్య చేసింది. పట్టణంలోని కోనేటి కాల్వ వీధిలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సురేష్ కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు సుజన్. సురేష్ కు రెండో భార్య ప్రేమ. గత కొంతకాలంగా వీరి మధ్య ఆస్తి గొడవలు, కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేమ, సుజన్ ను కత్తితో పలుమార్లు పొడిచి చంపి, ఆపై తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ప్రేమ తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News