: యుద్ధ వాహక నౌకలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెయిలర్

అమెరికా యుద్ధ విమానాల వాహక నౌక యూఎస్ఎస్ డ్వైట్ డీ ఐసెన్ హోవర్ లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా సెయిలర్ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. యూఎస్ఎస్ డ్వైట్ డీ ఐసెన్ హోవర్ ప్రస్తుతం ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆ ఉద్యోగినికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆమెకు వైద్య సాయమందించారు. పుట్టిన బిడ్డ 7 పౌండ్ల బరువు ఉంది. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. హెలికాఫ్టర్ ద్వారా మెడికల్ ఎస్కార్ట్ తో తల్లీబిడ్డలను సురక్షితంగా బహ్రెయిన్ కు తరలించామన్నారు. కాగా, సాధారణంగా గర్భిణులను 20 వారాల వరకు మాత్రమే నౌకలపై విధి నిర్వహణకు అనుమతిస్తారు. కానీ, ఆమె తన గర్భం గురించిన వివరాలను పూర్తిగా చెప్పకపోవడంతో యుద్ధ వాహక నౌకలోలోనే బిడ్డను ప్రసవించాల్సి వచ్చిందని సమాచారం.

More Telugu News