: గుంటూరులో కలకలం రేపుతున్న నాటుబాంబుల వ్యవహారం

గుంటూరు జిల్లాలో నిన్న పోలీసులు స్వాధీనం చేసుకున్న బాంబుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ములకలూరు గ్రామస్తులు కొనుగోలు చేసిన బాంబులను తిరిగి తయారీదారులకు ఇచ్చివేసే క్రమంలో పోలీసులకు పట్టుబట్టారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా రొంపిచర్ల మండలంలో తయారు చేసిన వీటిని ఇతర మండలాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు వ్యక్తుల ద్వారా బాంబులు సరఫరా చేసే వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఈ నేపథ్యంలో రొంపిచర్లకు చెందిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాంబులు తీసుకువెళుతున్న వ్యక్తులను విప్పరపల్లి, వడ్లమూడివారిపాలెం గ్రామాల మధ్య పొలంలో పట్టుకున్నారు. బాంబులు కొనుగోలు చేసిన తర్వాత, కొనుగోలుదారులు ఒకవేళ వద్దనుకుంటే కనుక, తిరిగి డబ్బులు చెల్లించే విధంగా వారి మధ్య ఒప్పందం ఉన్నట్లు పోలీసుల సమాచారం. బాంబుల తయారీదారులు ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కడ ఉన్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

More Telugu News