: గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన అఖిలేష్... యూపీ అసెంబ్లీ రద్దును కోరేందుకేనా?

వచ్చే సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన యూపీలో ఈ సంవత్సరమే ఎన్నికలు జరిగే వాతావరణం కనిపిస్తోంది. సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ఉదయం గవర్నర్ అపాయింట్ మెంటును కోరారు. దీంతో, అసెంబ్లీని రద్దు చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన గవర్నర్ ను కలవనున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. షెడ్యూల్ కన్నా ముందే రాష్ట్ర ఎన్నికలను జరిపించాలని ఆయన గవర్నర్ ను కోరనున్నట్టు సమాజ్ వాదీ పార్టీ వర్గాలు వెల్లడించడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే, అఖిలేష్ ఎందుకు గవర్నర్ ను కలుస్తున్నారన్న విషయమై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ విషయంలో సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశముంది.

More Telugu News