: సముద్రపు నత్త విషంతో మధుమేహానికి చెక్

సముద్రపు నత్త విడుదల చేసే విషంతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చని ఆస్ట్రేలియాకు చెందిన వాల్టర్‌ అండ్‌ ఎలీజా హాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నత్త విషంతో చిన్నచిన్న చేపలు క్షణంలో అచేతనమైపోతాయన్న సంగతి తెలిసిందే. దీంతో నత్త వాటిని హాయిగా ఆరగించేస్తుంది. 'కోనస్‌ జియోగ్రాఫస్‌' అనే ఆ నత్త విషం మధుమేహ రోగులకు శక్తిమంతమైన ఇన్సులిన్‌ (ఔషధం) గా పనిచేస్తుందని వారు వెల్లడించారు. నత్త విషంలోని ఇన్సులిన్‌ ప్రొటీన్‌ 3డీ నిర్మాణాన్ని పరిశీలించగా, అది మనుషుల శరీర కణాలు స్వీకరించేందుకు అనుకూలంగా ఉన్నట్లు తేలిందని వారు చెప్పారు. దీంతో నత్త విషాన్ని మధుమేహరోగులు ఔషధంగా వాడితే షుగర్ వ్యాధిపై పోరాడే ఇన్సులిన్ గా పని చేసి దానిని అరికడుతుందని వారు తెలిపారు.

More Telugu News