: నార్వే ప్రధానికి క్షమాపణలు చెప్పిన ‘ఫేస్ బుక్’

నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్ బెర్గ్ కు ప్రముఖ సోషల్ మీడియా ‘ఫేస్ బుక్’ క్షమాపణలు చెప్పింది. గత శుక్రవారం సోల్ బెర్గ్ తన ఫేస్ బుక్ ఖాతా నుంచి 1972లో వియత్నాంలో జరిగిన ఒక దాడికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో దుస్తులు లేకుండానే పరుగులు పెడుతున్న ఒక చిన్నారి ఈ ఫొటోలో ఉన్నాడు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని అశ్లీలతతో నిండిన ఫొటో ఇదంటూ సోల్ బెర్గ్ పోస్ట్ ను ‘ఫేస్ బుక్’ బ్లాక్ చేసింది. అయితే, చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ఫొటోను నిలిపివేయడంపై నార్వే వాసులు ఆగ్రహించారు... నిరసనలకు దిగారు. దీంతో ‘ఫేస్ బుక్’ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ‘ఫేస్ బుక్’ చీఫ్ ఆపరేటింగ్ అధికారి షెరల్ శాండ్ బర్గ్ క్షమాపణలు కోరుతూ సోల్ బెర్గ్ కు లేఖ రాశారు. ఫొటోలో అశ్లీలత కారణంగానే దానిని బ్లాక్ చేసినట్లు తెలిపారు. అశ్లీలతకు తావు లేకుండా ఉన్న కొన్ని ఫొటోలను సోల్ బెర్గ్ మళ్లీ పోస్ట్ చేశారు.

More Telugu News