: టెండర్ వేయకుండానే న్యాయ‌స్థానానికి వెళ్లడం భావ్యమేనా: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

కాంగ్రెస్‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈరోజు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తోన్న ఆయ‌న ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్ర‌భుత్వం చేపడుతోన్న‌ ప్రాజెక్టులను, అమ‌రావ‌తి నిర్మాణాన్ని అడ్డుకోవాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్నో ప్ర‌య్న‌తాలు చేస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఏ కారణం లేకపోయినా అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తూ ప్ర‌తిప‌క్ష నేత‌లు దుర్మార్గుల్లా వ్య‌వ‌హరిస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ఎందుకింత దురద? అని ఆయ‌న వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తి నిర్మాణం కోసం ప్రభుత్వం ప్ర‌తిపాదించిన‌ స్విస్‌ఛాలెంజ్‌పై వైసీపీ నేత పిటిషన్ వేసిన అంశంపై ఆయ‌న స్పందిస్తూ.. టెండర్ వేయకుండానే న్యాయ‌స్థానానికి వెళ్లడం భావ్య‌మేనా? అని ప్ర‌శ్నించారు.

More Telugu News