: సమకాలీన రాజకీయాల్లో కొనసాగడం కష్టంగా ఉంది...అందుకే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా: డేవిడ్ కామెరాన్

బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. బ్రెగ్జిట్ పోల్స్ లో వీగిపోవడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన కామెరాన్ తాజాగా పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన సమకాలీన రాజకీయాల్లో కొనసాగడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. అందుకే పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని థెరెస్సా మేపై అందరికీ నమ్మకం ఉందని, ఆమె నాయకత్వంలో బ్రిటన్ మరింత ముందుకు వెళ్తుందని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రధానులుగా వైదొలగినప్పటికీ మాజీ ప్రధానులు చాలా మంది పార్లమెంటులో సభ్యత్వం కలిగి ఉన్నారు. అయితే తాను ప్రధానిగా ఉండగా పెండింగ్ లో పెట్టిన బిల్లులను థెరెస్సా మే పాస్ చేయడంపై కినుక వహించిన కామెరాన్ పార్లమెంటు ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

More Telugu News