: వానలొస్తున్నాయ్.. జాగ్రత్త.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాలతోపాటు ఏజెన్సీ ప్రాంతాలలోను, హైదరాబాద్‌లోను అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సహాయ కార్యక్రమాల కోసం పోలీసు యంత్రాంగాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. ఇక రాష్ట్రస్థాయిలో 040-23454 నంబరుతో కంట్రోలు రూం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సీఎం సూచించారు. ఈమేరకు సీఎస్ రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు.

More Telugu News