: ఉత్తరకొరియా విషయంలో అమెరికాను తప్పుబడుతున్న చైనా!

ఉత్తర కొరియా నిర్వహించిన అణు పరీక్షలపై ప్రపంచ దేశాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో, ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించే చైనా కేవలం ఆంక్షలతో ప్రయోజనం ఉండదని వాదిస్తోంది. తాజాగా అమెరికా రక్షణశాఖ కార్యదర్శి యష్ కార్టర్ మాట్లాడుతూ, ఉత్తర కొరియాపై ఆంక్షల విషయంలో చైనా బాధ్యత ఎక్కువ ఉందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ మాట్లాడుతూ, ఉత్తర కొరియాపై కేవలం ఆంక్షలు విధిస్తే సరిపోదని అన్నారు. ఆంక్షలతో ఉత్తర కొరియా తనంతట తానుగా అణుపరీక్షలను నిలిపివేయదని ఆమె పేర్కొన్నారు. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించడం కంటే ముందు కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరముందని ఆమె తెలిపారు. అలా చేయడంలో అమెరికా బాధ్యత ఎక్కువ అని ఆమె తెలిపారు. దక్షిణ కొరియాలో అత్యాధునిక క్షిపణి వ్యవస్థను అమెరికా మోహరించడం వల్లే ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహిస్తోందని ఆమె స్పష్టం చేశారు.

More Telugu News