: కేంద్ర మంత్రి అనుప్రియతో అనుచితంగా ప్రవర్తించిన 158 మందిపై కేసు

కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ యూపీలోని ప్రతిప్ గఢ్ జిల్లాలో పర్యటిస్తున్న వేళ, కాన్వాయ్ ని అడ్డుకుని దాడి చేయడమే కాకుండా, ఆమెపై అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో 158 మందిపై రాణీగంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. "స్థానిక నేత వినోద్ దూబే, మరో 157 మందిపై కేసు పెట్టాము. వీరంతా గత రాత్రి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, అప్నాదళ్ కార్యకర్తలు నిర్వహిస్తున్న రోడ్ షోపై దాడికి దిగారు. మంత్రితో అనుచితంగా ప్రవర్తించారు. ఈ మేరకు, వారి ఫిర్యాదు మేరకు కేసు పెట్టాం" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ దూబే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అనుప్రియా మాత్రం దాడి అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ కుట్రేనని ఆరోపించారు.

More Telugu News