: 'స్విస్ చాలెంజ్'పై చంద్రబాబు సర్కారుకు చుక్కెదురు... స్టే విధించిన హైకోర్టు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టులను ఇచ్చేందుకు అమలు చేస్తున్న 'స్విస్ చాలెంజ్' పద్ధతిపై తెలుగు రాష్ట్రాల హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ మొత్తం బిడ్డింగ్ ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని వెల్లడించింది. ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ కోర్టులో పిటిషన్ వేస్తూ, స్విస్ చాలెంజ్ నిబంధనలను బహిర్గత పరచాలని, బిడ్డింగ్ లో పాల్గొనేందుకు నియమాలేమిటో చెప్పాలని కోర్టును కోరింది. దీనిపై విచారణ ప్రారంభించిన కోర్టు, పూర్తి స్థాయి విచారణను అక్టోబర్ 31న జరుపుతామని, ఈలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. నిర్మాణ రంగ కంపెనీలకు తెలియకుండా స్విస్ చాలెంజ్ ఏమిటని, రహస్యంగా కాంట్రాక్టులకు బిడ్లను ఆహ్వానించడం ఏంటని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది.

More Telugu News