: నరేంద్ర మోదీ మద్దతుతో కరాచీ వరకూ పాకిన బెలూచ్ నిరసనలు

ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పాక్ అకృత్యాలను ఎండగడుతూ, బెలూచిస్థాన్ కు అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం, స్వాతంత్ర్యాన్ని కోరుతున్న బెలూచ్ వాసుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, నిరసనల హోరు కరాచీని తాకింది. బెలూచ్ లో పాక్ సైన్యం వైఖరిని నిరసిస్తూ, బెలూచ్ మానవ హక్కుల సంస్థ కార్యకర్తలు కరాచీ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. తమ నేత రౌఫ్ బాలూచ్ కుటుంబ సభ్యులపై అకృత్యాలు ఆపాలని, బెలూచ్ మహిళలను రక్షించాలని వారు నినాదాలు చేశారు. కాశ్మీర్ ను కల్లోల పరచాలని చూస్తున్న పాకిస్థాన్, అటు బెలూచిస్థాన్ లో సైతం దుర్మార్గాలకు ఒడిగడుతోందని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలను ప్రేరణగా తీసుకుని బెలూచ్ తో పాటు, వివిధ దేశాల్లో పాక్ ఎంబసీలున్న ప్రాంతాల్లో బెలూచ్ నేతలు ప్రదర్శనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

More Telugu News