: ఈ ముగ్గురంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, ప్రాతఃస్మరణీయులు: హాస్యనటుడు బ్రహ్మానందం

‘సినిమా ఇండస్ట్రీలో నాకు గురువు గారు జంధ్యాల. నన్ను బాగా ప్రోత్సహించిన వారు చిరంజీవి. మంచి అవకాశాలు, పాత్రలిచ్చిన వారు రామానాయుడుగారు. ఈ ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, ప్రాత:స్మరణీయులు’ అని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో తన గురువు అయిన జంధ్యాల పేరు చెప్పకుండా నేను ఉండలేను’ అన్నారు. ఇక తాను ఎంకరేజ్ చేసిన హాస్యనటులెవరూ లేరని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా జంధ్యాల చెప్పిన కొన్ని మాటలను బ్రహ్మానందం ప్రస్తావించారు.‘మీ దయ వల్ల నేను ఇంతటివాడిని అయినాను అని ఒకసారి జంధ్యాలగారితో అన్నాను. ‘డోంట్ సే లైక్ దట్ బ్రహ్మానందం. నువ్వు ఆరోజు ఎక్కిన బస్సులో నేను డ్రైవర్ ను మాత్రమే. నేను కాకపోతే ఇంకొకరు డ్రైవర్ గా ఉంటారు. కానీ, బస్సు చేరాల్సిన గమ్యం చేరుతుంది. ఆప్ట్ర్రాల్ ఐయామ్ లైక్ దట్’ అని ఆ రోజున జంధ్యాల అన్నారని బ్రహ్మానందం జ్ఞాపకం చేసుకున్నారు.

More Telugu News