: విపక్ష సభ్యుడిని గౌరవిస్తూ, పొగడ్తలు గుప్పించిన చంద్రబాబు!

తాను శాసన మండలిలో ప్రసంగిస్తున్న వేళ, అడ్డు తగిలిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ రామసూర్యనారాయణపై చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్నికల వేళ రామసూర్యనారాయణ ఓడిపోవాలని తాను కోరుకున్నానని గుర్తు చేసుకున్న చంద్రబాబు, సమాజానికి ఆయన లాంటి వ్యక్తులు అవసరం ఎంతో ఉందని కొనియాడారు. పార్టీ పరంగా ఓడిపోవాలని తాను కోరుకున్నా, నిజాయతీ, నారాయణ ప్రవర్తనలే విజయాన్ని దగ్గర చేశాయని అన్నారు. గెలిచిన తరువాత రామసూర్యనారాయణ గురించి తెలుసుకున్నానని అన్నారు. అంతకుముందు రామసూర్యనారాయణ చంద్రబాబు ప్రసంగానికి అడ్డు తగులుతూ, మీరు కష్టించి పనిచేస్తున్నా, మంత్రులు, ఎమ్మెల్యేలూ కష్టపడటం లేదని, ఖర్చులను తగ్గించుకోమని వారికి చెప్పాలని సూచించారు.

More Telugu News