: చంద్రుడి ఉపరితలంపై ఏలియన్స్ యాంటెన్నా?

చంద్రుడి ఉపరితలంపై ఏలియన్స్ యాంటెన్నాను అమర్చారా? దీనికి అవుననే అంటున్నారు ఓ శాస్త్రవేత్త. ఫిన్ లాండ్ కు చెందిన మార్క్ సవాల్హా యుఎఫ్‌ఓల (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబెక్ట్స్) పై పరిశోధన చేస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా నాసా చంద్రుడి ఉపరితలాన్ని తీసిన చిత్రాలను గమనిస్తున్న ఆయన, అక్కడ ఓ ఆకారం నీడను గుర్తించారు. దానిపై పరిశోధనలు నిర్వహించిన ఆయన దానిని యాంటెన్నాగా గుర్తించారు. దానిని మరింత నిశితంగా గమనించిన ఆయన, దానిని ఏలియన్ బేస్ లో ఏర్పాటు చేసిన యాంటెన్నాగా పేర్కొంటున్నారు. చంద్రుని ఉపరితలంపై ఉన్న కొండల నీడ నిలువుగా పడడంతో ఇది అంత సులువుగా కనిపించదని ఆయన తెలిపారు. అయితే నాసా తీసిన ఫోటోల్లో ఆ యాంటెన్నా నీడను కూడా గుర్తించవచ్చని ఆయన అంటున్నారు. ఆయన వాదనతో యూఎఫ్ఓ నిపుణుడు నిగెల్ వాట్సన్ కూడా అంగీకరిస్తున్నారు. అంతే కాకుండా దీనిని ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేయడం కూడా తమ అనుమానాలు బలపడేలా చేస్తోందని వారు తెలిపారు. ఈ యాంటెన్నా విషయాన్ని నాసా రహస్యంగా ఉంచుతోందని ఆయన తెలిపారు. ఏలియన్స్ చంద్రునిపై ఖనిజాన్ని తవ్వేందుకు ఈ యాంటెన్నాను ఏర్పాటు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. సౌరవ్యవస్థలో ఏలియన్స్ కు చెందిన నిర్మాణాలను గుర్తించడం తనకు ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. ఏలియన్స్ నిర్మాణాల నుంచి మనం చాలా నేర్చుకోవాలని ఆయన తన వెబ్ సైట్ లో సూచించారు.

More Telugu News