: వైసీపీ సభ్యులపై కఠిన చర్చలు తప్పవా?... ప్రివిలేజ్ కమిటీకి విపక్ష సభ్యుల విజువల్స్!

మూడు రోజుల ఏపీ శాసనసభా సమావేశాల్లో ఏ అంశాన్ని కూడా చర్చకు రాకుండా అడ్డుకున్న వైపీసీ సభ్యులపై కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు నల్లరంగు చొక్కాలతోనే అసెంబ్లీకి వచ్చిన వైసీపీ సభ్యులు చివరి రోజైన నేడు తమ ఆందోళనలను మరింత పెంచారు. చెప్పులతోనే అసెంబ్లీ కార్యదర్శి టేబుల్ ఎక్కిన ఆ పార్టీ సభ్యులు స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ఏకంగా ఓ అట్టముక్కను విసిరేశారు. ఈ క్రమంలో సభను స్పీకర్ వాయిదా వేయకముందే సభ నియమ నిబంధనలను తుంగలో తొక్కిన వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఓ తీర్మానాన్ని ప్రతిపాదించారు. సదరు తీర్మానం కాపీతో పాటు సభలో వైసీపీ సభ్యుల వ్యవహార సరళికి సంబంధించిన విజువల్స్ ప్రివిలేజ్ కమిటీకి చేరిపోయాయి. వీటిని పరిశీలించిన తర్వాత వైసీపీ సభ్యులపై ఏ తరహా చర్యలు చేపట్టాలన్న విషయంపై ప్రివిలేజ్ కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుంది.

More Telugu News