: డ్రగ్స్ రాకెట్ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు.. నేనో యోగిని: బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి

బాలీవుడ్ చిత్రాల్లో న‌టించి ఎంతో పేరు సంపాదించుకున్న నిన్న‌టి త‌రం న‌టి మమతా కులకర్ణి డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితురాలిగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కెన్యాలో ఉంటున్న ఆమె ఈ అంశంపై తాజాగా స్పందిస్తూ తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చెప్పింది. అంతేకాదు, తానొక యోగిని అంటూ వ్యాఖ్యానించింది. తాను 20 సంవ‌త్స‌రాలుగా ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న‌ట్లు చెప్పింది. నిర్దోషి అయిన త‌న‌ను ఈ కేసులో ఇరికించార‌ని ఆమె ఆరోపించింది. త‌న‌ను కేసులోకి లాగిన‌ మహారాష్ట్ర పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, కిరెన్ రిజిజులను లేఖ ద్వారా ఆమె కోరింది. కాగా, డ్రగ్స్ అక్రమ రవాణా కేసుకు సంబంధించి మ‌మ‌తా కుల‌క‌ర్ణి భ‌ర్త‌ వికీ గోస్వామిని దుబాయ్ లో పోలీసులు ఇప్ప‌టికే అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోప‌ణ‌ల‌తో మ‌హారాష్ట్ర‌లోని థానే పోలీసులు మమతా కులకర్ణిపై కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో మమతా కులకర్ణిని కూడా కెన్యా పోలీసులు విచారిస్తున్నారు. ఆమె బ్యాంక్ ఖాతాలు ఎనిమిదింటిని మహారాష్ట్ర పోలీసులు స్తంభింపజేశారు.

More Telugu News