: కొత్తగా కనుగొన్న పరాన్నజీవికి ఒబామా పేరు

కొత్తగా కనుగొన్న ఒక పరాన్నజీవి (పేరాసైట్)కి అమెరికా అధ్యక్షుడు ఒబామా పేరు పెట్టారు. అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ పరాన్నజీవిని ఒబామా పేరుతో పిలుచుకుంటున్నట్లు ‘పారా సైటాలజీ’ పత్రికలో పేర్కొన్నారు. ఈ పత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం, ఈ పరాన్నజీవికి ‘బరాక్ ట్రెమా ఒబామై’ అనే శాస్త్రీయ నామం పెట్టారు. కాగా, ఈ కొత్త పరాన్నజీవిని థామస్ ఆర్ ప్లాట్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఒబామకు ఆయన దూరపు బంధువు కూడా అవుతారు. థామస్ తన కెరీర్ లో ఇంతవరకు 32 కొత్త ప్రాణులను కనిపెట్టారు. గతంలో తాను కనుగొన్న కొత్త ప్రాణులకు థామస్ తన మామగారి పేరు, పీహెచ్ డీ గైడ్ పేరు పెట్టారు. తాజాగా కనుగొన్న ఈ కొత్త పరాన్నజీవికి మాత్రం దేశాధ్యక్షుడైన ఒబామా పేరే సరైందని, దీనిని ఆయన గౌరవంగా భావించాలని అన్నారు.

More Telugu News