: పదవులకు నేతలు ఆశపడితే ప్రజల బతుకులు ఇలాగే ఉంటాయి: టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన పవన్

రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండటానికి అవకాశవాద రాజకీయాలే కారణమని, కేంద్రంలో పదవులకు ఆశ పడితే రాష్ట్ర ప్రజల బతుకులు ఇలాగే ఉంటాయని టీడీపీ పేరును వెల్లడించకుండా ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. ప్రజా సమస్యలు ఎన్నటికీ పరిష్కారం కావని, పదవులను ప్రజా సమస్యలు పరిష్కరించుకునేందుకు వాడుకోవాలని భావించిన వారే నిజమైన రాజకీయ నేతలని అన్నారు. "ఈ కాకినాడ నుంచి నేను చెప్పేది ఒకటే. మీరు సమస్యలను పరిష్కరించకపోయినా ఫర్వాలేదు. కొత్త సమస్యలను సృష్టించకండి. ఉన్న సమస్యలు చాలు. నిరుద్యోగం చాలు. దారిద్ర్యం చాలు. నీటి సమస్యలు చాలు. మళ్లీ తెలుగు ప్రజల మధ్యలో చిచ్చుపెట్టే ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దయచేసి ఆపండి" అంటూ గొంతెత్తి అరిచారు. "అందరూ నన్ను అడుగుతారు. రెండున్నర సంవత్సరాలు ఏం చేశావ్? కుంభకర్ణుడిలా నిద్రపోయావా? అంటారు. కళ్లు మూసుకుంటే నిద్రని ఎందుకు అనుకుంటారు. అరే... ధ్యానం అని ఎందుకు అనుకోరు? ఎవరి సంస్కారాన్ని బట్టి వారికి నిద్రలానో, ధ్యానంలానో కనిపిస్తుంది" అన్నారు. పవన్ ఉద్వేగభరిత ప్రసంగం కొనసాగుతోంది.

More Telugu News