: 'అమ్మ' స్ఫూర్తి... పేదల కడుపు నింపేందుకు మధ్యప్రదేశ్ సీఎం కొత్త పథకం

తమిళనాడులో విజయవంతమైన అమ్మ క్యాంటీన్ల స్ఫూర్తితో మధ్య ప్రదేశ్ లో పేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 25 నుంచి రూ. 10కే కడుపునిండా భోజనం పెట్టేలా చౌక క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చపాతీ, పప్పు, కూర, అన్నం, పచ్చడితో ఈ భోజనం ఉంటుందని, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాల సందర్భంగా పథకం ప్రారంభమవుతుందని శివరాజ్ వెల్లడించారు. తొలి దశలో గ్వాలియర్, భోపాల్, ఇండోర్, జబల్ పూర్ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ఉంటాయని, ఆపై మిగతా ప్రాంతాలకు విస్తరించాలన్నది సీఎం ఆలోచనని అధికారులు తెలిపారు.

More Telugu News